Rashmika Mandanna: రష్మికపై మరోసారి కన్నడ వాసుల ఫైర్ - ఆ విషయం మాకు తెలియలేదంటూ ఆగ్రహం, అసలేం జరిగిందంటే?
Kannada Fans: నేషనల్ క్రష్ రష్మికపై కన్నడ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల 'ఛావా' ప్రమోషన్స్‌లో భాగంగా 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను' అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా ట్రోల్ చేస్తున్నారు.

Kannada Fans Fires On National Rashmika Comments About Native Place: దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna). శుక్రవారం విడుదలైన 'ఛావా' (Chhaava) మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 'ఛావా' ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబయిలో సొంతూరిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై కన్నడ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రష్మికపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వేరే ప్రాంతానికి వెళ్తే సొంతూరి గురించి చెప్పరా.? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన 'ఛావా'.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.' అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద చర్చకే దారితీశాయి. రష్మిక వ్యాఖ్యలను పలువురు కన్నడీగులు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 'రష్మిక సొంతూరు విరాజ్ పేట నుంచి హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చింది.?. ఈ విషయం మాకు తెలియలేదు..!, వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి.?' అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే తొలిసారి కాదు..
కాగా.. నేషనల్ క్రష్ రష్మిక ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆమె కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. 'పుష్ప ది రైజ్' సక్సెస్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టూడెంట్‌గా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫోటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే, తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన 'పరంవా' పేరు చెప్పేందుకు రష్మిక ఆసక్తి కనబరచకపోవడంపై ఫ్యాన్స్ ఫైరయ్యారు. అలాగే, గతంలో దక్షిణాది పాటలపైనా ఆమె చేసిన కామెంట్స్ ట్రోలింగ్‌కు గురయ్యాయి. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయని.. దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయని రష్మిక చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తర్వాత వివరణ సైతం ఇచ్చారు.
తెలుగులో వరుస హిట్స్
కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట్‌కు చెందిన రష్మిక 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు తెరకు 'ఛలో' మూవీతో పరిచయమయ్యారు. టాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె అటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తెలుగు, హిందీతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రష్మిక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రెండ్', సల్మాన్ ఖాన్ - మురుగదాస్ కాంబోలో రూపొందుతోన్న 'సికిందర్', అలాగే ధనుష్-శేఖర్ కమ్ముల 'కుబేర' చిత్రాల్లో నటిస్తున్నారు.
Also Read: రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టి 'క్లీంకార'ను చూశారా?... దాచాలని ట్రై చేసినా ఫేస్ రివీల్ అయ్యిందిగా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

