Self Care Tips : సెల్ఫ్ కేర్ టిప్స్.. శారీరకంగా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా ఇలా స్ట్రాంగ్ అయిపోండి
Self-Love Tips : సెల్ఫ్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే అది కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా, ఎమోషనల్‌గా కూడా మిమ్మల్ని స్ట్రాంగ్‌గా చేసేదై ఉండాలి. అవి ఎలా ఉండాలంటే..

Daily Self-Care Routine : సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫ్ లవ్ లాంటిదే. అయితే దీనిని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. తమ గురించి పట్టించుకోకుండా అందరి హెల్త్, మెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. సెల్ఫ్ కేర్ కచ్చితంగా తీసుకోవాలి. అయితే సెల్ఫ్ కేర్ అంటే కేవలం శారీరకంగానే కాదు.. మెంటల్‌గా, ఎమోషనల్‌గా మిమ్మల్ని స్ట్రాంగ్‌గా చేసేదై ఉండాలి. మరి వాటిని మీరు ఎలా అచీవ్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
శారీరకంగా తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్..
ఫిజికల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలో చూద్దాం. ముందుగా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. పోషకాహార లోపం వల్ల మీరు వీక్‌గా ఉంటారు. వీటిని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్ రూపంలో శరీరానికి కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. హైడ్రేషన్ కూడా చాలా అవసరం. దీనివల్ల మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడమే కాకుండా.. మెరుగైన స్కిన్ హెల్త్‌ని పొందుతారు.
వ్యాయామం కూడా ఫిజికల్ సెల్ఫ్కేర్లో భాగమే. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మీ రొటీన్లో భాగం చేసుకోండి. అలాగే మీకు నచ్చిన హాబీల్లో యాక్టివ్‌గా ఉండండి. బయటకు వెళ్తూ ఉండండి. యాక్టివ్‌గా ఉండడం ఎంత ముఖ్యమో.. శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని గుర్తించుకోండి.
మెంటల్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
జర్నలింగ్ అనేది మెంటల్ హెల్త్‌ని బిల్డ్ చేస్తుంది. దీనివల్ల మీరు చేసే పనులు, చేయాల్సిన పనులను ఫిల్టర్ చేయవచ్చు. అలాగే మీలోని బర్డెన్‌ని జర్నలింగ్ లైట్ చేస్తుంది. ఇతరులకు చెప్పలేని విషయాలను మీరు జర్నలింగ్లో రాసుకుని రిలీఫ్ అవ్వొచ్చు. మెడిటేషన్ కూడా మానసిక ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. క్రియేటివ్‌గా ఉండేందుకు ట్రై చేయండి. అలాగే మానసిక ప్రశాంతత కోసం రెస్ట్ కూడా ముఖ్యమే.
మీరు ఉండే ప్రదేశాలు ఎంత చిందరవందరగా ఉంటే మీరు అంత చిరాకులో ఉంటారు. కాబట్టి మీరుండే ప్లేస్‌ని నీట్‌గా సర్దుకోండి. ఇలా ఆర్గనైంజింగ్గా ఉండడం వల్ల చేయాల్సిన పనులు ఈజీగా అవుతాయి. అలాగే గోల్ సెట్టింగ్ ముఖ్యం. దీనివల్ల మీరు మీ గోల్స్‌ని రీచ్ అవ్వడం సులభం అవుతుంది.
ఎమోషనల్‌గా ఎలా సెల్ఫ్‌కేర్ తీసుకోవాలంటే..
మీరు ఓ వ్యక్తితో రిలేషన్లో ఉంటూ.. ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. కొన్ని బౌండరీలు సెట్ చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ అనేది ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. రిలేషన్షిప్స్ కూడా మిమ్మల్ని ఎమోషనల్‌గా స్ట్రాంగ్ చేసే వాటిపైనే మీ సమయాన్ని, ప్రేమని ఇన్వెస్ట్ చేయండి. డిజిటల్ డిటాక్స్ అనేది అన్నింటికన్నా ఉత్తమమైనది. అలాగే రిఫ్లక్షన్స్ కూడా మంచిది. లోపల దాచుకోకుండా నచ్చిన రిప్లై ఇస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
సెల్ఫ్ కేర్ అంటే కేవలం శారీరకంగానే అనుకునేవారు వీటిని కూడా ఫాలో అవ్వాలని గుర్తించుకోండి. మీరు మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా లేకుంటే.. ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా సెల్ఫ్కేర్ని ప్రారంభించి.. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అయిపోండి.






















