Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
మోంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఎంతో చరిత్ర కలిగిన శ్రీ పోతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి చారిత్రక గృహం కూలిపోయింది. మోంథా తుఫాన్ ప్రభావంతో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం అర్థరాత్రి ఉన్నట్లుండి ఈ భవనం కూలిపోయింది. 16వ శతాబ్దంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపాలెంలోని మఠంలో స్వయంగా నిర్మించుకొని నివాసమున్న ఇల్లిది. దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు కూలిపోవడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా.. బ్రహ్మంగారు నివసించిన ఎంతో చరిత్ర గల ఈ గృహాన్ని అధికారులు పరిరక్షించకపోవడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని, దీనికి అధికారులదే బాధ్యతని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వందల ఏళ్ల నాటి భవనం కావడంతో.. శిథిలావస్థకు చేరుకుందని, అందుకే కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. కాలకర్తగా వీర బ్రహ్మేంద్రం స్వామి రాసిన గ్రంథాలను నేటికీ ఆరాధ్య గ్రంథాలుగా పూజించే భక్తులు ఉన్న రోజుల్లో ఉన్న ఇల్లు కూడా కూలిపోవటంతో ఆ భక్తులంతా ఆందోళన చెందుతున్నారు.





















