అన్వేషించండి

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం - రూ.442 కోట్ల ఆస్తుల జప్తు - ఎవరెవరివి అంటే?

ED in AP liquor: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేసింది.

ED in AP liquor scam seized Rs 442 crore:  ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిందితుల ఆస్తులను జప్తు చేసింది.  ఈ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డికి చెందిన బంధువులు, అనుబంధ సంస్థల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సుమారు 441.63 కోట్ల రూపాయల  విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు పలు భూములు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్  కేంద్రంగా జరిగిన భారీ అవకతవకలపై ఈడీ లోతైన దర్యాప్తు చేపట్టింది. మద్యం సరఫరా, సేకరణ ,  విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సిండికేట్లుగా ఏర్పడి, డిజిటల్ చెల్లింపులను పక్కన పెట్టి కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా భారీ ఎత్తున నల్లధనాన్ని ఆర్జించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ అక్రమ సంపాదనను వివిధ సంస్థల పేరుతో స్థిరాస్తులుగా మార్చినట్లు ఆధారాలు లభించాయి.

ఈ కేసులో కీలక వ్యక్తులైన రాజశేఖర రెడ్డి, వాసుదేవ రెడ్డిలు గత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన హోదాల్లో ఉండి, మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. నిర్దేశిత కంపెనీలకే మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కేలా చేయడం, తక్కువ నాణ్యత గల మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన కమిషన్లను బినామీ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అటాచ్ చేసిన 442 కోట్ల రూపాయల ఆస్తులు ఈ అక్రమ మార్గాల్లో సంపాదించినవేనని ప్రాథమికంగా నిర్ధారించారు.  

తాజా జప్తులతో ఏపీలో మద్యం మాఫియా మ, దానికి సహకరించిన అధికారుల చుట్టూ ఈడీ ఉచ్చు బిగిసినట్లయింది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్ కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు రాజకీయ నేతలు, అధికారులపై కూడా చర్యలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అరెస్టయిన నిందితులను ప్రశ్నించడం ద్వారా లభించిన సమాచారం ఆధారంగా మరిన్ని ఆస్తులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ నిమగ్నమైంది.                                

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Breaking News: ఎమ్మెల్యే బాలకృష్ణకు గాయాలు.. ఫోన్ చేసి పరామర్శించిన మంత్రి నారా లోకేష్
ఎమ్మెల్యే బాలకృష్ణకు గాయాలు.. ఫోన్ చేసి పరామర్శించిన మంత్రి నారా లోకేష్
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
Chandrababu Naidu Delhi Tour: హస్తినకు సీఎం చంద్రబాబు - రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. ఢిల్లీ పర్యటన వెనుక అసలు కథ!
హస్తినకు సీఎం చంద్రబాబు - రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. ఢిల్లీ పర్యటన వెనుక అసలు కథ!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget