(Source: ECI | ABP NEWS)
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
మీరు చూస్తున్నది ఏంటో ఏదో పాల సముద్రం లా ఉంది అనుకుంటున్నారు. కాదు మీరు చూస్తున్నది ఓ పెను తుపాను. జమైకాను అతలాకుతలం చేస్తున్న మెలిసా హరికేన్ ఐ ఇది. పెను తుపాను కేంద్రం అన్నమాట. 174 ఏళ్ల జమైకా వాతావరణ శాఖ రికార్డుల చరిత్రలో ఇదే అతిపెద్ద తుపానుగా నమోదైంది. కొన్ని వేల ఇళ్లను కూల్చేసి ప్రజలను నిరాశ్రయులుగా మార్చిన పెనుతుపాను 295కిలోమీటర్ల వేగంతో గాలులను క్రియేట్ చేస్తూ ఓ దేశాన్ని నాశనం చేస్తున్న తుపాను కేంద్రంలో ఎలా ఉంటుందో చూడటానికి యూఎస్ ఎయిర్ ఫోర్స్ అతిపెద్ద సాహసం చేసింది. యూఎస్ నేవీలోనే అత్యంత బలమైన..పెను తుపానులను సైతం తట్టుకోగలిగే WC-130J Super Hercules విమానం ద్వారా 7గురు అత్యంత నైపుణ్యం ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నేరుగా తుపాను కేంద్రంలోకి వెళ్లారు. సెంటర్ లో ప్రశాంతంగానే ఉంటుంది ఇలా కానీ దీనిలోకి ఎంటర్ అవ్వటమే అతిపెద్ద సాహసం. ఎంతో శ్రమించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇదిగో అతిభయానక తుపానైన హరికేన్ మెలిసాను ఇలా రికార్డు చేశారు. ఇలాంటి విజువల్స్ మళ్లీ మనం చూడలేకపోవచ్చు. సో ఈ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చూడండి.





















