Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Azharuddin : మంత్రిగా అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Azharuddin will be sworn in as a minister on Friday: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అయిన అజహరుద్దీన్‌కు మంత్రి పదవి తెచ్చి పెడుతోంది. శుక్రవారం ఆయన రాజ్ భవన్ లో తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్ లో ఇప్పటికీ మూడు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఒక దాన్ని భర్తీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. పోటీ చేయాలని అనుకున్నా..ఆయన బలమైన అభ్యర్థి కాలేరని ఎమ్మెల్సీగా పదవి ఇవ్వాలని నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేశారు.
శుక్రవారం ఉదయం రాజ్ భవన్‌లో మంత్రిగా అజహర్ ప్రమాణ స్వీకారం
శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్ భవన్‌లో అజహరుద్దీన్ తో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఆయనకు హోం, మైనార్టీ శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు కీలకంగా మారారు. దాదాలుగా లక్ష ఓట్లు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. వారిని ఆకట్టుకునేందుకు మంత్రి వర్గంలోకి మైనార్టీ నేతను తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కేబినెట్‌లో మైనార్టీ లేరు.. ఇది మైనార్టీ వర్గాల్లో అసంతృప్తికి కారణం అవుతుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు.
మైనార్టీ నుంచి మంత్రిగా అవకాశం - జూబ్లిహిల్స్ ఉపఎన్నికల అవసరం
ఎమ్మెల్యేలుగా మైనార్టీ వర్గం నుంచి ఎవరూ గెలవలేదు. అందుకే ఇప్పటి వరకూ తీసుకోలేకపోయారు. ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ కూడా జూబ్లిహిల్స్‌లో మైనార్టీ వర్గంతో సమావేశం అయినప్పుడు కేబినెట్ లోకి మైనార్టీని తీసుకుంటారని చెప్పారు. అయితే ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని అనుకోలేకపోయారు. అయితే అజహరుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేశారు. ఆ సిఫారనును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు కోర్టులో ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రిగా ప్రమాణం చేయవచ్చు. ఆరు నెలల్లో ఉభయసభల్లో ఏదో ఓ సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.
హైకమాండ్ ఆశీస్సులతో మంత్రి పదవి
క్రికెటర్ గా రిటైరన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఓ సారి గెలిచారు. రాజస్థాన్ నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వతా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో ఆయన జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేశారు.కానీ రెండో స్థానంలో నిలిచారు. ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న నేతగా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి.





















