Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Bhimavaram Song Lyrics : పాప్ సింగర్ స్మిత నుంచి మరో పాపులర్ ఆల్బమ్ వచ్చేసింది. సంక్రాంతి స్పెషల్‌గా 'భీమవరం బీట్' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ సందడి చేశారు.

Smita's Bhimavaram Beat Song Lyrics : పాప్ సింగర్ స్మిత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ఓల్డ్ సాంగ్స్‌ను నేటి యూత్ ట్రెండ్‌కు సెట్ అయ్యేలా రీమిక్స్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. రీసెంట్‌గానే అప్పటి ఓల్డ్ సాంగ్ 'మసక మసక చీకటిలో' పాటను సరికొత్తగా రీమిక్స్ ర్యాప్ చేయగా ఫుల్ ట్రెండ్ అయ్యింది. తాజాగా సంక్రాంతి స్పెషల్‌గా సరికొత్త ఆల్బమ్‌తో ముందుకొచ్చారు.
స్టెప్పులేసిన డిప్యూటీ స్పీకర్ RRR
కోనసీమ జిల్లాల్లో సంక్రాంతి అంటే ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. అలాంటి పండుగ జోష్ మరింత పెంచేలా స్మిత ఈ సాంగ్ కంపోజ్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్‌తో కలిసి స్టెప్పులు అదరగొట్టారు. ఈ పాటలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వారితో కలిసి డ్యాన్స్ అదరగొట్టారు. ప్రస్తుతం 'భీమవరం బీట్' వీడియో యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్ లిరిక్స్ ఇవే...
పల్లవి
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా...
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా...
సంక్రాంతి వచ్చింది పండుగనే తెచ్చింది
ఊరంతా పచ్చ పచ్చ తోటలతో మెరిసింది
ముసి ముసి ముసి నవ్వులు... రంగు రంగు బట్టలు
గంగిరెద్దుల ఆటలు... పేకాట ఊపులు...
ఊరంతా పండుగా... సంబరాలే నిండుగే
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
కొ క్కొ క్కొ క్కో కాస్కో కోడి పందాలంటేనే భీమవరం రాస్కో...
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేం చూస్కో...
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
చరణం 1
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
అల్లరిగా ఆటలాడి మనసుని దోచేస్తివిరా
అల్లరిగా ఆటలాడి మనసుని దోచేస్తివిరా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
అడగడుగున సవ్వడి... ఊరంతా కెచ్చడీ...
గోదావరి గారడీ... చిందేద్దాం రోయ్
చిన్నా పెద్దా లేదని... ఊరంతా ఒకటని...
చేయి చేయి కలిపేసి చిందేద్దాం రోయ్...
చరణం 2
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
ముసి ముసి ముసి నవ్వులు... రంగు రంగు బట్టలు
గంగిరెద్దుల ఆటలు...
పిండి వంటల మోతలు... పేకాట ఊపులు
సినిమాల్లో కేకలు...
కొ క్కొ క్కొ క్కో కాస్కో కోడి పందాలంటేనే భీమవరం రాస్కో...
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేం చూస్కో...
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా






















