సైక్లోన్లకు పేర్లు పెట్టే ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెటీరలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) నిర్వహిస్తుంది. ఇది ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ.

Published by: Raja Sekhar Allu

ప్రపంచాన్ని 6 ప్రాంతీయ బేసిన్లుగా విభజించి, ప్రతి బేసిన్‌కు ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ పెట్టారు. ఇవి పేర్లను ఖరారు చేస్తాయి.

Published by: Raja Sekhar Allu

బంగాళాఖాతం, అరేబియా సముద్రం సైక్లోన్లకు భారత్, పాక్ సహా 13 దేశాలు కలిసి ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (PTC) ఏర్పాటు చేశాయి.

Published by: Raja Sekhar Allu

ప్రతి ప్రాంతీయ సమితి ముందుగానే 8-13 సంవత్సరాలకు సరిపడా పేర్ల జాబితాను (లిస్ట్) తయారు చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి దేశం తనకు కేటాయింపబడిన 13 పేర్లను సూచిస్తుంది. ఇవి స్థానిక భాషలు, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, జంతువులు, పుష్పాల నుండి తీసుకుంటారు.

Published by: Raja Sekhar Allu

సూచించిన పేర్లు WMO యొక్క ఎస్కేప్ (ESCAP) ప్యానెల్ సమావేశంలో చర్చించి ఓకే చేస్తారు.

Published by: Raja Sekhar Allu

పేర్లు క్రమంలో ఉపయోగిస్తారు. ఒక సైక్లోన్ తర్వాత మరొకటి వస్తే తదుపరి పేరు వాడతారు. జాబితా అయిపోతే మళ్లీ మొదటి నుండి మొదలవుతుంది.

Published by: Raja Sekhar Allu

తీవ్ర నష్టం కలిగించిన సైక్లోన్ పేరును శాశ్వతంగా తొలగిస్తారు. ఆ దేశం కొత్త పేరు సూచిస్తుంది.

Published by: Raja Sekhar Allu

సైక్లోన్ ఏర్పడి, గాలుల వేగం 62 కి.మీ/గం మించినప్పుడు RSMC పేరు పెడుతుంది.

Published by: Raja Sekhar Allu

పేర్లు వార్నింగ్‌లు, మీడియా, ప్రజలకు సులభంగా గుర్తుండేలా, గందరగోళం తగ్గించేలా సహాయపడతాయి. అంతకు మించి ప్రత్యేకత లేదు.

Published by: Raja Sekhar Allu