అన్వేషించండి

Worlds Heaviest Living Tree : ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది.. దాని వయసు, పూర్తి డిటైల్స్ ఇవే

Heaviest Living Tree : ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు ఒకటి ఉంది. ఇది ఎంత పెద్దది, వయస్సు ఎంత, దాని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

Largest Tree in the World : కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్ లోపల ఒక భారీ చెట్టు ఉంది. ఇది అనేక సామ్రాజ్యాలు ఏర్పడటం, కూలిపోవడాన్ని చూసింది. 'జనరల్ షెర్మెన్(General Sherman)' అధికారికంగా వాల్యూమ్ పరంగా భూమిపైనే అతిపెద్ద చెట్టుగా దీనిని పరిగణిస్తారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీని వయస్సు 2,200 నుంచి 2,700 సంవత్సరాల మధ్య ఉంటుంది. అంటే.. చాలా పురాతన నాగరికతలతోపాటు.. ఇంకా అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని ఈ చెట్టు చూస్తూ ఉంది. 

అన్ని విధాలా భారీ చెట్టు 

జనరల్ షెర్మెన్ దాదాపు 275 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు కానప్పటికీ.. దాని అసలు రికార్డు దాని పెద్ద ట్రంక్ వాల్యూమ్లో ఉంది. ఇది దాదాపు 52,500 క్యూబిక్ అడుగుల పరిమాణంలో ఉంది. నేలపై దాని ట్రంక్ వ్యాసం దాదాపు 36 అడుగులు. దాని మొత్తం బరువు దాదాపు 1.27 మిలియన్ కిలోలుగా అంచనా వేశారు. దీని బరువు దాదాపు ఏడు పెద్ద నీలి తిమింగిలాల బరువుతో సమానంగా ఉంటుందట.

ఇప్పటికీ పెరుగుతోందిగా

2000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఉన్నప్పటికీ.. ఈ చెట్టు ఇప్పటికీ జీవించి ఉంది. అంతేకాకుండా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఇది 60 అడుగుల ఎత్తైన చెట్టుకు సమానమైన కొత్త కలపను ఇస్తుంది. 2006 లో దాని అతిపెద్ద కొమ్మలలో ఒకటి దాదాపు 100 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుతో విరిగిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క కొమ్మ అనేక పూర్తి చెట్ల కంటే పెద్దదిగా ఉందట.

ఎలా మనుగడ సాగించింది?

ఈ చెట్టు ఇప్పటి ఎలా బతికి ఉందనే డౌట్ చాలామందికి ఉంటుంది. దాని వెనుక రహస్యం ఏమిటంటే.. దాని సొంత సహజ రక్షణ వ్యవస్థ. దీని బెరడు దాదాపు 2 అడుగుల మందంగా, చాలా పీచుగా ఉంటుంది. కాబట్టి ఇది అడవి మంటలను తట్టుకుంటుంది. బెరడు నెమ్మదిగా మండుతుంది. దీనివల్ల లోపలి పొరలు దెబ్బతినకుండా ఉంటాయి. దీనితో పాటు దాని కలపలో టానిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక సహజ రసాయనం. ఇది కుళ్ళిపోకుండా నిరోధిస్తుంది. కీటకాలను దూరంగా ఉంచుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇతర రికార్డులు కలిగి ఉన్న చెట్లు

ఈ చెట్టు వాల్యూమ్ పరంగా అతిపెద్దది అయినప్పటికీ.. ఇతర చెట్లు వేర్వేరు గ్లోబల్ రికార్డులను కలిగి ఉన్నాయి. చిలీలో 'గ్రేట్ గ్రాండ్ ఫాదర్' అని పిలువబడే ఒక సైప్రస్ చెట్టు దాదాపు 5,400 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు హైపెరియన్. ఇది ఒక కోస్ట్ రెడ్‌వుడ్, 380 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget