తులసి మొక్కను గౌరి దేవిగా భావిస్తూ.. చాలామంది దీనిని పెంచుకుంటారు.

అయితే కొందరు ఎంత జాగ్రత్తలు తీసుకున్న మొక్క ఎండిపోతూ ఉంటుంది.

కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే తులసి మొక్కను బాగా పెంచవచ్చు.

తులసి మొక్కకు సూర్యకాంతి అవసరం. ఇది మితమైన సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది.

మొక్క చుట్టూ మట్టి పొడిబారకుండా.. నీటిని రెగ్యూలర్​గా పోయాలి.

ప్లాస్టిక్ కుండీల్లో కంటే నేలలో, మట్టికుండల్లో తులసి బాగా పెరుగుతుంది.

మొక్కకు ఎరువుగా.. అప్పుడప్పుడు ఆవు పేడ, సహజమైన కంపోస్ట్ వేయాలి.

అప్పుడప్పుడు కొమ్మల చివర్లు, పూతను కత్తిరిస్తే ఎదుగుదల బాగుంటుంది.

All Images Credit : Pinterest