పరగడుపున చాయ్ తాగితే మంచిది కాదా?

చాలా మంది పొద్దున్నే లేవగానే వేడి వేడి చాయ్ తాగుతారు.

పరగడుపున చాయ్ తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఖాళీ కడుపుతో చాయ్ తాగితే కడుపులో ఎసిడిక్‌, ఆల్కలిన్‌ రసాయనాల సమతుల్యం దెబ్బతింటుంది.

పొద్దున్నే చాయ్ తాగితే లాక్టోజ్‌ త్వరగా జీర్ణం కాక, కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు కలుగుతాయి.

వేడి వేడి చాయ్ తాగడం వల్ల దంతాల మీది ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

టీలోని కెఫిన్‌ కారణంగా ఒక్కోసారి కళ్లు తిరగడం, వికారం కలుగుతాయి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాతే టీ తాగడం మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com