పిస్తా చాలా ఆరోగ్యకరమైన స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఆప్రికాట్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ప్లమ్స్లో పొటాషియం ఎక్కువ. కనుక బీపీ తగ్గిస్తాయి. క్రాన్ బెర్రీస్ లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ తగ్గిస్తాయి. పికాన్ గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ అన్ని పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యకరం. కిస్మిస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. అంజీరాలో విటమిన్లు, మినరల్స్ ఉండడం వల్ల ఇవి చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్. మెగ్నీషియం, జింక్ ఉండడం వల్ల జీడిపప్పులు మధుమేహులకు చాలా మంచిది. ఖర్జూరాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. క్యాలరీలు కూడా తక్కువ. గమనిక : ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్ల సూచనల మేరకే వీటిని తీసుకోవాలి.