Image Source: pexels

చెట్లపైన నివసించే జంతువులు అనగానే మనకి ముందు గుర్తొచ్చేది కోతులు.

కోతులే కాకుండా అడవులలో కొన్ని జంతువులు చెట్లపైనే నివసిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

స్లాత్​లు: ఇవి ఎక్కువగా వాటి జీవితాన్ని చెట్లపైనే గడుపుతాయి. అంతే కాకుండా స్లాత్​లు చాలా నెమ్మదిగా కదులుతాయి.

ఒరంగుటాన్లు: చెట్లపై నివసించే జంతువులలో ఒరాంగుటాన్లే పెద్దవి. వీటి చేతులు చాలా పొడవుగా ఉంటాయి.

కోలాస్: ఇవి చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి. నేలపైన ఎక్కువసేపు ఉండలేవు.

ఊసరవెల్లులు: ఇవి ఎక్కువ చెట్లపైనే ఉంటాయి. అంతేకాకుండా రంగులను కూడా మార్చగలదు.

గిబ్బన్స్ : ఇవి చూడటానికి కోతులులాగా ఉంటాయి. గిబ్బన్స్ ఆగ్నేసియాలో ఎక్కువగా కనిపిస్తాయి.

స్పైడర్ కోతులు: దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవులలో కనిపిస్తాయి .ఇవి ఎక్కువగా పండ్లను తింటాయి.