‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ అందంగా, ఆరోగ్యంగా కనిపించేందుకు చాలా జాగ్రత్తలు పాటిస్తుందట. సైక్లింగ్, రన్నింగ్, ఎరోబిక్స్ ఎక్సర్సైజుల వంటి కార్డియాక్ వ్యాయామాలు చేస్తుంది. ఇవి చురుగ్గా, హార్ట్ హెల్తీ గా ఉంచుతాయి. కండరాలు పుష్టిగా, టోన్డ్ గా ఉండేందుకు, ఆరోగ్యకరమైన బరువు కోసం వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్ వంటి వ్యాయామలు తప్పక చేస్తుంది. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు, కండరాలు రికవర్ అయ్యేందుకు యోగా సాధన చేస్తుంది. అంకితభావం, స్థిరమైన లైఫ్ స్టయిల్ అమృత ఫిట్నెస్ కు ముఖ్యమైన కారణాలట. లీన్ ప్రొటీన్ కలిగిన చేపలు, టోఫూ, చికెన్, స్ప్రౌట్స్ వంటి ఆహారాలు తప్పక తీసుకుంటుంది. అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అంకిత భావం, శ్రద్ధ అవసరమని అమృతని చూసి తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా అమ్మూలా ఫిట్‌నెస్ సూత్రాలు పాటించేయండి.