‘రెడ్’ జ్యూస్ అంటే ఏమిటనుకుంటున్నారా? మీకు తెలిసిందే. సహజంగా లభించే ఎరుపు రంగు పండ్లు, కూరగాయలల్లో లైకోపిన్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రెడ్ జ్యూసులను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. బెర్రీలు వంటి పండ్ల నుంచి తయారు చేసే జ్యూస్ తాగితే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందుతాయి. రెడ్ జ్యూస్ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో సహజ డిటాక్స్ ఎంజైమ్స్ ఉంటాయి. రెడ్ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వాపును తగ్గించడంలో రెడ్ జ్యూస్ మేలు చేస్తుంది. అలెర్జీలు, ఉబ్బసం, ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మాన్ని యవ్వన్నంగా ఉంచుతుంది. నొప్పి నివారణిగా పనిచేస్తుంది. శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సహజ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. రోజంతా శక్తిని అందిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.