ఆహారం తీసుకునేప్పుడు సాధారణంగా సరిగ్గా నమిలి తినము. అందువల్ల ఎక్కువ తినేస్తుంటాము. బాగా నమిలి మింగాలి.

చిన్న ప్లేట్ లో ఎక్కువ మొత్తంలో భోజనం వడ్డించుకోవడానికి రాదు. తక్కువ వడ్డించుకుంటాం కనుక తక్కువ ఉపయోగిస్తాం.

భోంచేసే సమయంలో పూర్తి ఏకాగ్రతతో తినాలి. టీవీ చూస్తూ లేదా మొబైల్ చూస్తూ తినకూడదు.

తగినన్ని నీళ్లు తాగాలి. నీళ్లు శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపుతాయి. అదనపు కొవ్వును తగ్గిస్తాయి.

నిద్ర, విశ్రాంతి అనేవి చాలా ముఖ్యం. ఇది నీరసం, అలసట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

వీలైనంత వరకు చక్కెరకు దూరంగా ఉండాలి. చక్కెర తినక పోతే చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే బ్లోటింగ్ కి కారణం కావచ్చు. ఉదయాన్నే సరైన, హెవీ బ్రేక్ ఫాస్ట్ తప్పక చెయ్యాలి.

కచ్చితమైన ఫలితాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.