ఈ లక్షణాలుంటే మీ శరీరంలో తగినంత ప్రొటీన్ లేదని అర్థం. కండర ద్రవ్యరాశికి ప్రొటీన్ చాలా అవసరం. మీరు తగినంత ప్రొటీన్ తీసుకోనట్లయితే కండరాలు బలహీనంగా మారుతాయి. ప్రొటీన్ మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. తగినంత ప్రొటీన్ తీసుకోనట్లయితే అలసటతో బాధపడుతుంటారు. జుట్టుకు ప్రొటీన్ చాలా అవసరం. తగినంత ప్రొటీన్ లేకుంటే జుట్టుకు పెళుసుగా మారుతుంది ఇమ్యూనిటీ బాగుండాలంటే ప్రొటీన్ చాలా ముఖ్యం. ప్రొటీన్ లేకుంటే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. ఆకలిహార్మోన్లను నియంత్రించేందుకు భోజనం తర్వాత కడుపు నిండుగా ఉండేందుకు ప్రొటీన్ అవసరం అవుతుంది. మీరు తగినంత ప్రొటీన్ తీసుకోనట్లయితే తరచుగా తినాలనే కోరికను అనుభవిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్ లేనట్లయితే జుట్టు రాలిపోతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.