Image Source: pexels

సోంపు టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది

భారతీయుల ఆహారంలో సోంపు శతాబ్దాలుగా వస్తోంది. సోంపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

సోంపు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

సోంపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం సహా జీర్ణ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహించే అనెథోల్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి.

పీరియడ్స్ పెయిన్ లేదా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న స్త్రీలు సోంపు టీ తాగితే ఉపశమనం పొందవచ్చు.

ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

సోంపు టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఈ టీ క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధశక్తి బలపడుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా శరీరాన్ని కాపాడుతుంది.

ముఖంపై మొటిమలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దగ్గు, ఆస్తమా ఉన్నవాళ్లు ఎంతో మేలుచేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ పేషంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.