అన్నం మనం ఇక్కడ తినే ముఖ్యమైన పదార్థం. అన్నాన్ని రకరకాల వంటకాలకు ముఖ్యమైన పదార్థంగా వాడుతారు.

తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలనుకున్నపుడు పెరుగన్నం మంచి ఆప్షన్. పెరుగు కలిపిన అన్నానికి కొద్దిగా పోపు వేస్తే చాలు.

పులుపు బాగా ఇష్టపడే వారికి నిమ్మకాయ పులిహోర నచ్చుతుంది. అన్నంలో నిమ్మరసం కలిపి పోపులు కలిపితే చాలు.

కరకరలాడే పప్పులు, పల్లీలు, కరివేపాకుతో ఉండే చింతపండు పులిహోర రుచి ముందు మరేది సాటిరాదు.

జీడి పప్పులు, కొద్ది పాటి మసాలాలు కలిపి కొబ్బరి పాలతో వండే కొబ్బరి అన్నాన్ని ఏదైనా మసాలా కూరతో తింటే బావుంటుంది.

కర్ణాటక ప్రాంతంలో బాగా పాపులరైన బిసిబెల్లిబాత్ లంచ్ లేదా డిన్నర్ కి కంప్లీట్ మీల్ గా పనికొస్తుంది.

చిత్రాన్నము, టమాటో రైస్ వంటివి కూడా చిటికెలో తయారై రుచిగా కూడా ఉంటాయి.



మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ రోజే వీటిని ట్రై చెయ్యండి.