ఈ సమస్యలు ఉన్నాయా? పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి మీ ఆహారం నుంచి పాల ఉత్పత్తులను తొలగిస్తే.. ఊహించని మార్పులు చూస్తారు. మీరు రోజువారీ ఆహారం నుంచి పాల ఉత్పత్తులను తగ్గిస్తే కొన్ని ప్రయోజనాలు పొందుతారు. అవేంటో చూద్దాం. పాల ఉత్పత్తులను తగ్గిస్తే ఉబ్బరం, గ్యాస్ తగ్గుతుంది. లాక్టోస్ వల్ల ఇబ్బంది ఎదుర్కొనేవారికి జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. పాల ఉత్పత్తులను తగ్గించుకుంటే శరీరంలో వాపు, మంట తగ్గుతుంది. మొటిమలు, చర్మంపై దద్దుర్లు వంటివి తగ్గుతాయి. పాల ఉత్పత్తులను తగ్గిస్తే చర్మంపై మొటిమలు కూడా తగ్గుతాయి. మిల్క్ ప్రొడక్టులు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. వీటికి దూరంగా ఉండండి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.