రెగ్యులర్ గా మల్టీవిటమిన్లు తీసుకుంటే బెనిఫిట్స్ఇవే మన శరీరానికి మల్టీవిటమిన్లు చాలా అవసరం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. శరీరం సరైన పనితీరుకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. మల్టీవిటమిన్లు జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ, శక్తి ఉత్పత్తికి సపోర్టు చేస్తాయి. మల్టీవిటమిన్లు శక్తిని పెంచడంతోపాటు అలసటతో పోరాడటంతో సహాయపడతాయి. బలమైన రోగనిరోధ్ వ్యవస్థకు మల్టీవిటమిన్లు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లను, అనారోగ్యం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ లాంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. మల్టీవిటమిన్లు బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడతాయి. కొన్ని విటమిన్లు ఆరోగ్యకరమైన గుండె, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్నికాపాడుతాయి. మొటిమలు, వ్రుద్ధాప్యంను తగ్గిస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.