ఆలోవెరా జెల్ సహజంగా చర్మానికి మెరుపును అందించగలదు. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అలోవెరా జెల్ చర్మం మీది మృతకణాలు తొలగించి.. కొత్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రి పూట ఆలోవెరా జెల్ రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంతో మెరుపు సంతరించుకుంటుంది. ఎండకి చర్మం కందిపోతే ఆలోవెరా జెల్ మంచి మందుగా పనిచేస్తుంది. వేసవిలో ఎండ వేడికి నల్లబడిన చర్మం.. రాత్రి పూట ఆలోవెరా జెల్ రాసుకుంటే తిరిగి కోలుకుంటుంది. ఆలోవెరా తో యాంటీ ఎజింగ్ బెనిఫిట్స్ కూడా అందుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మం మీద ఏదైనా కొత్తగా వాడాలని అనుకున్నపుడు ఒకసారి డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనల తర్వాతే ఈ టిప్స్ పాటించండి.