హోలీ చాలా మందికి ఇష్టమైన పండగ. ఎంత ఫన్ ఉంటుందో అంత హాని కూడా ఉండొచ్చు.

హోలీ రంగులు చర్మానికి, జుట్టుకు నష్టం చెయ్యవచ్చు. అలాంటి సందర్భంలో జుట్టును ఎలా కాపాడుకోవాలో చూద్దాం.

హోలీ ఆట మొదలు పెట్టడానికి ముందే జుట్టుకు తగినంత కొబ్బరినూనె పట్టించాలి. ఇది రంగును జుట్టు పీల్చుకోకుండా ఆపుతుంది.

హోలీ ఆడే సమయంలో స్కార్ఫ్ లేదా క్యాప్ తో జుట్టును కప్పి ఉంచుకుంటే మంచిది. నేరుగా రంగు జుట్టుకు అంటుకోకుండా ఉంటుంది.

పొడవు జుట్టు ఉన్న వారు ముడి కట్టుకోవాలి లేదా జడ వేసుకోవాలి. ఇలా చేస్తే కొంత వరకు జుట్టుకు రంగు అంటుకోకుండా ఉంటుంది.

జుట్టుకు కలర్ ప్రొటెక్టాంట్ ప్రాడక్ట్ ఏదైనా రాసుకుంటే జుట్టును రంగుల నుంచి కాపాడుతుంది.

హోలీ తర్వాత గోరువెచ్చని నీళ్లతో రంగులు పొయ్యే వరకు కడిగెయ్యాలి. వేడినీరు వాడితే జుట్టు పొడిబారి తెగిపోవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.