మనషులు చేసిన జంతువులు - ఇవి హైబ్రీడ్ జంతువులని మీకు తెలుసా? సెలెక్టివ్ బ్రీడింగ్ లేదా జెనెటిక్ ద్వారా మానవులు అనే జంతువులను సృష్టించారు. వాటిలో కొన్ని ఇవే.. సింహం, పులి హైబ్రిడ్ లిగర్స్. ఇది మగ సింహం, ఆడ పులి సంతానం. పులులు, సింహాల మరో హైబ్రిడ్ టైగోన్స్. మగపులి, ఆడ సింహం సంతానం. జీబ్రాయిడ్స్ గుర్రాలు లేదా గాడిదలు వంటి అశ్వాలతో జీబ్రాలు సంకరజాతిగా ఉద్భవించాయి. బీఫాలో దేశీయ పశువులు, అమెరికన్ బైసన్.. సంకరజాతులు. గొడ్డుమాంసం కోసం వీటిని పెంచుతారు. వోల్ఫిన్లు కిల్లర్ వేల్. సముద్రపు డాల్ఫిన్ జాతి, సాధారణ డాల్ఫిన్‌ల సంకరజాతులు. కామా అనేది మగ డ్రోమెడరీ ఒంటె. ఆడ లామాకు చెందిన హైబ్రిడ్ జంతువు. గీప్ అనేది మేక, గొర్రెల సంకరజాతి. మేకలు, గొర్రెలు వేర్వేరు సంఖ్యలో క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి.