బరువు తగ్గేందుకు ది బెస్ట్ ఆప్షన్ ఆపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం, అమైనో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి. ఇందులోని ఎసిటిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును తగ్గించి పొట్టను క్లీన్ చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గించడంలో మంచిగా హెల్ప్ చేస్తుంది. వందగ్రాముల యాపిల్ సైడర్ వెనిగర్ లో 22కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ కొవ్వును తగ్గిస్తుందని బయోసైన్స్ అధ్యయనం పేర్కొంది. ఆకలి కోరికలను తీర్చడంతోపాటు అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. భోజనం చేసిన తర్వాత షుగర్ పెరగకుండా కాపాడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.