పిజ్జా తింటే సూపర్ హెల్త్ బెనిఫిట్స్ - నమ్మబుద్ధి కావడం లేదా? పిజ్జాలో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ ఏదైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పిజ్జాలో క్రస్ట్‌లోని కార్బోహైడ్రేట్లు, టాపింగ్స్‌లో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పిజ్జాలో జోడించే ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తులసి ఆయిల్ పిజ్జాను తాజాగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఫెన్నెల్ గింజలు,అవిసె గింజలు వంటి విత్తనాలు పిజ్జాలపై చల్లుతారు.అందలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వేగన్ పిజ్జాలు పాల రహిత చీజ్ ఉంటుంది. జీడిపప్పు, బాదం, సోయా గింజలతో వాటిని తయారు చేస్తారు. పిజ్జాను మీ ఆహారం చేర్చుకుంటే ఫైబర్ లభిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. టొమాటో సాస్ లైకోపీన్ గొప్ప మూలం. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పిజ్జాలో ఉండే చీజ్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెరుగైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. పిజ్జా మంచిది కదా అని అదే పనిగా తినొద్దు. మితంగా తింటేనే పై ప్రయోజనాలు లభిస్తాయి. అతిగా తింటే ఆస్పత్రిపాలవుతారు.