ఎంత డైట్ పాటించినా.. ఏమి చేసినా.. సాయంత్ర అయ్యేసరికి ఏదొక స్నాక్ తినాలనిపిస్తుంది. ఆ సమయంలో చిరుతిళ్లకు ఎక్కువ టెంప్ట్ అవుతూ.. పర్లేదులే ఈ ఒక్కసారికి అని లాగించేస్తారు. అయితే ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీరు ఆకలితో ఉండి.. నిజంగా ఏమైనా తినాలనుకున్నప్పుడు మఖానే తినండి. వాటి రుచిని పెంచుకోవడం కోసం కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తినండి. మఖానేలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలోని కాల్షియం బోన్స్, దంతాలు హెల్తీగా ఉండేలా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా మఖానేను హెల్తీ స్నాక్‌గా తీసుకోవచ్చు. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pinterest)