Image Source: Pexels

వేసవిలో హాట్ వాటర్ తాగొచ్చా?

అసలే వేసవి, అందులో హాట్ వాటర్.. వామ్మో తాగడం కష్టమే అనుకుంటున్నారా?

మరి, అంత వేడిలో హాట్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

వేసవిలో కూలింగ్ వాటర్ తాగడం కంటే గోరు వెచ్చని నీరు తాగడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

ఔను.. నిజం, వేసవిలో గోరు వెచ్చని నీరు తాగడం మంచిదేనట. దానివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

గోరు వెచ్చని నీరు.. ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సహకరిస్తుంది.

దానివల్ల జీర్ణక్రియ సజావుగా పనిచేస్తుంది. ఫలితంగా కావల్సిన పోషకాలను శరీరం గ్రహిస్తుంది.

హాట్ వాటర్ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. వేసవిలో ఏర్పడే రోగాల నుంచి బయటపడొచ్చు.

Image Source: Pexels

కానీ, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే.. తప్పకుండా డాక్టర్‌ సలహా తీసుకోండి. ఈ వివరాలు అవగాహనకే.