అరటి పండ్లు జుట్టుకు మంచి పోషణను ఇస్తాయి. కాబట్టి, అరటి పండు మాస్క్ ట్రై చెయ్యండి. అరటి పండు హెయిర్ మాస్క్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. బాగా పండిన అరటి పండు తీసుకుని దాన్ని మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక టెబుల్ స్పూన్ కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు జుట్టుకు పట్టించాలి. తలకు షవర్ క్యాప్ వేసుకోవాలి. 30-60 నిమిషాల పాటు అలాగే వదిలెయ్యాలి. తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చెయ్యాలి. ఈ జుట్టును సహజంగా గాలికి ఆరబెట్టుకోవాలి. మ్యాజిక్ జరిగినట్టుగా జుట్టులో ఒక గొప్ప మార్పు గమనించవచ్చు. అరటి పండులో విటమిన్లు, మినరల్స్, సహజమైన ఆయిల్స్ ఉంటాయి. కనుక జుట్టు, స్కాల్ప్ మాయిశ్చరైజ్ అవుతాయి. కొబ్బరినూనె అనాదిగా జుట్టు పోషణలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మాడులోకి ఇంకిపోయి జుట్టుకు పోషణను ఇస్తుంది. వారంలో ఒక్కసారి ఈ మాస్క్ వేసుకుంటే డ్యామేజైన జుట్టు కూడా తిరిగి మెరిసిపోతుంది. ఈ సమాచారం అవగాహన కోసమే.