ఈ ఫుడ్ చాలా హెల్తీ అనుకుంటాం.. కానీ, కాదు! మనం తినే ఆహారాలన్నీ ఆరోగ్యానికి మంచివే అనుకుంటాం. కానీ, వాటిలో డేంజర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. గ్రానోలా హెల్తీ స్నాక్స్ లా కనిపిస్తుంది. ఇందులో కేలరీలు, షుగర్ ఎక్కువగా ఉంటుంది. బనానా చిప్స్ డీప్ ఫ్రై చేసినప్పుడు దానిలో కొవ్వు పెరుగుతుంది. క్యాన్డ్ సూప్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. రుచి కోసం బయట కొనుగోలు చేసే పెరుగులో చక్కెరను కలుపుతారు. ఇది బరువుకు కారణం అవుతుంది. శీతలపానీయాల్లో విటమిన్లు, ఖనిజాలు ఉండవు. పూర్తిగా కేలరీలు ఉంటాయి. కొన్ని ప్రొటీన్ బార్లలో అదనపు షుగర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కీడు చేస్తుంది. ప్రీ ప్యాక్డ్ స్మూతీస్‌లో పోషకాలు, విటమిన్లు, ఫైబర్ ఉండదు. అధిక షుగర్ కంటెంట్ కలిగి ఉంటాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.