సాధారణంగా చాలామంది పనిలో పడి ఒకే ప్రదేశంలో గంటల పాటు కూర్చొంటారు. కానీ, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి ఇక్కడ చూద్దాం.. ఊబకాయం, మధుమేహం సమస్యలను పెంచుతుంది. వెన్ను నొప్పి ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువవుతుంది. రక్త ప్రసరణ బలహీనమై అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఒత్తిడి పెరగడమే కాకుండా, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.