ఖర్జూరాలు కెరొటెనాయిడ్స్, ఫ్లవనాయిడ్స్, ఫినోలిక్ ఆసిడ్ అనేవి ఖర్జూరాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లలో కొన్ని. ఈ పోషకాలన్నీ కూడా చర్మాన్ని ఫ్రీరాడికల్ ఆక్సిడేషన్ నుంచి ఒక కవచంలా కాపాడుతాయి. ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజమైన చక్కెరలు, ఇతరపోషకాలు ఉండడం వల్ల ఇవి తీసుకుంటే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఖర్జూరాలు రెగ్యులర్ గా తినేవారిలో చర్మం త్వరగా పొడిబారదు. విటమిన్ C ఖర్జూరాల్లో పుష్కలం. ఇది కొల్లాజెన్ నిర్మాణానికి అవసరం. చర్మ ఆరోగ్యానికి కొల్లాజెన్ చాలా అవసరం. ఖర్జూరాల్లో జింక్, విటమిన్ C, విటమిన్ E, ఇతర మినరల్స్ ఉండడం వల్ల చర్మం లోపలి నుంచి హీలింగ్ ప్రాసెస్ కి తోడ్పడుతాయి. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఖర్జూరాల్లో ఉంటాయి. కనుక సోరియాసిస్, ఎగ్జీమా, మొటిమల వంటివి రాకుండా నివారిస్తాయి. ఫ్రీరాడికల్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా సన్ బర్న్, ప్రిమెచ్యూర్ ఏజింగ్, స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఖర్జూరాలు కాపాడుతాయి. యూవీ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో ఫ్లెవనాయిడ్స్, కెరొటెనాయిడ్స్ సహాయపడతాయి. ఇవి ఖర్జురాల్లో పుష్కలం. విటమిన్లు A, B, E తోపాటు పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ వల్ల చర్మం లోపలి నుంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.