బాదాములు పోషకాల నిధుల వంటివి. రాత్రంతా నానబెట్టిన బాదాములు మరింత పోషకాలను సంతరించుకుంటాయి. నానబెట్టిన బాదం తింటే జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమలు విడుదలయ్యి పోషకాల శోషణ మెరుగవుతుంది. బాదాముల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. శరీరంలో శక్తినిరంతరం వెలువడేందుకు దోహదం చేస్తాయి. బాదాముల్లో ఉండే విటమిన్ E చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. త్వరగా వయసు ప్రభావం చర్మం మీద కనబడకుండా నివారిస్తుంది. నానబెట్టిన బాదాములు తింటే చాలా సమయం పాటు కడుపునిండుగా ఉన్న భావన కలిగిస్తాయి. ఫలితంగా క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. బాదాముల్లో మోనోసాచ్యూరేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదాముల్లో ఉండే మెగ్నీషియం, విటమిన్ E మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెదడు మీద వయసు ప్రభావాన్ని తగ్గిస్తాయి. బాదాముల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C మెండుగా ఉంటుంది. కనుక నిరోధక శక్తి మెరుగవుతుంది. ఈ సమాచారం అవగాహన కోసమే.