ఆయుర్వేదం: సాయంత్రం 6 గంటలకు ముందే భోజనం చేసేయాలట, ఎందుకంటే? సాయంత్రం 6 గంటలలోపు భోజనం చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయట. నిత్యం ఒక క్రమ పద్ధతిలో భోజనం చేయాలని ఆయుర్వేదం చెబుతోంది. సాయంత్రం 6 గంటలలోపు డిన్నర్ చేస్తే.. శరీరంలో సహజమైన జీర్ణక్రియ జరుగుతుంది. మెరుగైన జీర్ణక్రియ, పోషకాల సమీకరణకు వీలు కల్పిస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ఉబ్బరం, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణసమస్యలకు దారితీస్తుంది. 6 గంటలలోపు డిన్నర్ చేయడం వల్ల నిద్రపోయే ముందు ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సమయం ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేస్తే పిత్తదోషాన్ని సమతుల్యం చేయడంతోపాటు శరీరాన్ని కాపాడుకోవచ్చు. రాత్రి భోజనం త్వరగా చేస్తే బరువు అదుపులో ఉంటుంది. కేలరీలను బర్న్ చేసేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. రాత్రిపూట అతిగా తింటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.