సమ్మర్లో చెమట ఎక్కువ పట్టడం వల్ల తల అంతా దురద వస్తుంటుంది. తల పొడిబారడం, చుండ్రు, ఇన్ఫెక్షన్లు ఇలా ఇతర కారణాలు కూడా దురదను కలిగిస్తాయి. ఆ సమయంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల దురదను దూరం చేసుకోవచ్చు. స్కాల్ప్‌ను ఆయిల్‌తో మసాజ్ చేసి.. జుట్టుకు తేమ అందేలా చూడండి. అలోవెరా జెల్‌ను నేరుగా తలకు అప్లై చేస్తే దురద తగ్గుతుంది. తలస్నానం చేసే సమయంలో మసాజర్‌తో స్కాల్ప్‌ను మసాజ్ చేయండి. కెమికల్స్‌కి దూరంగా ఉండి.. యోగర్ట్, పెరుగు, గుడ్డు వంటి వాటిని తలకు అప్లై చేయండి. విటమిన్స్ లోపం వల్ల కూడా తలలో దురద వచ్చే అవకాశాలు ఎక్కువ. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)