చలికాలంలోనే కాదు.. కొందరికి సమ్మర్లో కూడా ఫ్లూ చేస్తుంది. వాతావరణం మారడం, వేడి వల్ల జలుబు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని ఇంటి చిట్కాలతో సమ్మర్ ఫ్లూని తగ్గించుకోవచ్చు. పాలల్లో పసుపు, మిరియాల పొడి వేసి కలిపి రోజూ రెండు పూటల తాగితే మంచిది. తేనెలో నిమ్మరసం లేదా అల్లం జ్యూస్ కలిపి షాట్ లాగా తీసుకుంటే మంచిది. గ్లాసు నీటిలో టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి.. నోటిని పుక్కిలించాలి. సీజన్ ఏదైనా.. ఆవిరి పడితే ఫ్లూ లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అల్లం టీలో తేనె కలిపి రెండు సార్లు తాగితే రిలీఫ్‌గా ఉంటుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)