మహిళల్లో వయసు పెరిగే కొద్ది కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది.

ఆ సమయంలో తమ డైట్​లో కొన్ని ఫుడ్స్ కలిపి తీసుకోవాలంటున్నారు నిపుణులు.

పాలు, యోగర్ట్, చీజ్ వంటి పాల ఉత్పత్తులు కాల్షియం పెంచుతాయి.

ఆకుకూరల్లో కాల్షియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

టోఫుని మీరు రకరకాల వంటల్లో లేదా సలాడ్స్​లో కలిపి తీసుకోవచ్చు.

బాదం కాల్షియం, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్​కు మంచి మూలం.

నువ్వులు, చియా సీడ్స్ వంటి వాటిని స్నాక్స్​లో కలిపి తీసుకోవాలి.

బీన్స్, శెనగలు వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

పలు రకాల చేపలు కూడా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)