Image Source: pexels

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవే

యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడంలో సహాయపడతాయి.

కణాలు దెబ్బతినకుండా యాంటీఆక్సిడెంట్లు కాపాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ఏవో చూద్దాం.

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, యాంటీఆక్సిడెండ్లు ఉంటాయి.

డార్క్ చాక్లెట్లు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కోకో ఫ్లవనోల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

డార్క్ చాక్లెట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బాదం, వాల్నట్స్, పిస్తాపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకు కూరల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటాకెరోటిన్ ఉంటుంది.

గ్రీన్ టీలో కాటెచిన్ లు ఉంటాయి. ఇది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

టమోటాలలో లైకోపీస్ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు గుండెజబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.