హెల్మెట్ పెట్టుకుంటే ఇలా జరుగుతుందని భయపడుతున్నారా? ఇవిగో టిప్స్!

ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్ తప్పనిసరి.

అయితే, చాలామందికి హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు.

హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని భావిస్తారు. మరి ఇందులో నిజమెంత?

జుట్టు రాలడానికి హెల్మెట్ కారణం కాదు. దాని సైజే కారణం.

ఔనండి, హెల్మెట్ టైటుగా ఉంటే జుట్టు కుదళ్లపై ఒత్తిడి పడుతుంది.

హెల్మెట్ కొనుగోలు చేసేప్పుడు మీ తలకు సరిపడేలా, వదులుగా ఉండేది సెలక్ట్ చేసుకోవాలి.

హెల్మెట్ ఎక్కువ బరువున్నా జుట్టుకు నష్టమే. రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది.

రక్త ప్రసరణకు సమస్యలు ఏర్పడితే జుట్టు రాలే సమస్యలు పెరుగుతాయి.

హెల్మెట్ క్లీన్‌గా లేకపోయినా బ్యాక్టీరియా పెరిగి జుట్టు నిర్జీవంగా మారుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్ క్లాత్‌ కలిగిన హెల్మెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఖరీదు ఎక్కువైనా వాటిని వాడండి.