నార్త్ ఇండియన్ డైట్ అంత డేంజరా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి దక్షిణాది ఫుడ్‌కు ఎంత క్రేజ్ ఉందో.. నార్త్ ఇండియన్ ఫుడ్‌కూ అంతే క్రేజ్ ఉంది. అయితే, దక్షిణాది ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, నార్త్ ఫుడ్ మాత్రం డేంజర్. చండీగడ్‌లోని PGIMER నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కూడా ఈ అధ్యయనంలో పాల్గొంది. అధ్యయనంలో భాగంగా నార్త్ ఇండియాన్స్ ఫుడ్ హ్యాబిట్స్‌ను పరిశీలించారు. ఈ ఆహారంలో ఉప్పు, పాస్పరస్‌ను సిఫార్సు కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని తేలింది. అలాగే వారి ఆహారంలో ప్రోటీన్, పోటాషియం తక్కువగా ఉన్నట్లు తేలింది. నార్త్ ఫుడ్ వల్ల గుండెపోటు, రక్తపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. చూశారాగా, మీకు నార్త్ ఫుడ్ ఎక్కువ తినే అలవాటు ఉంటే జర భద్రం.