అరటిపండు తినడానికి సరైన సమయం ఏదో తెలుసా అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. అరటిపండ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడం, జీర్ణక్రియ గుండెకు మేలు చేస్తుంది. అరటిపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. చక్కెర స్థాయిలలో స్పైక్ లకు దారి తీయవు. అరటిపండును తినడానికి సరైన సమయం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. రోజులో ఎప్పుడైనా అరటిపండ్లను తినవచ్చు. కానీ రాత్రి జీవక్రియ తక్కువగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం అరటిపండ్లను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట అరటిపండ్లు తింటే నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఇందులోని అమైన్లో ఆమ్లం నిద్రను నియంత్రిస్తుంది. దగ్గుతో ఇబ్బందిపడేవారు రాత్రిపూట అరటిపండు తినకూడదు. బ్రేక్ ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం పూట అరటిపండు తినడానికి సరైన సమయం. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.