స్కాల్ప్ జిడ్డుగా మారి చుండ్రు ఏర్పడి విసుగ్గా ఉంటే ముల్తానీ మట్టి మంచి పరిష్కారం చూపుతుంది. ఎలా వాడాలో చూద్దాం. ముల్తానీమిట్టి 2,3 స్పూన్లు తీసుకోవాలి. దీనికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ లో గడ్డలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పేస్టును మాడుకు, జుట్టుకు పట్టించాలి. పూర్తిగా అంటేందుకు గాను బ్రష్ కూడా ఉపయోగించవచ్చు. పూర్తిగా పట్టించిన తర్వాత 5 నిమిషాల పాటు కొద్దిగా మసాజ్ చేయ్యాలి. 15, 20 నిమిషాల తర్వాత ముల్తానీ మిట్టిని కడిగేసుకోవాలి. జుట్టుకు ఏదైనా కొత్తగా వాడాలని నిర్ణయించుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.