డార్క్ చాక్లెట్‌కు, బ్రెయిన్‌కు లింక్ ఏమిటీ? డార్క్ చాక్లెట్ మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెదడు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనోల్స్ మెదడుకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లో ఫెనిలేథైలమైన్, సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మెదడు కణాలను ఒత్తిడికి లోనవ్వకుండా కాపాడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్స్ మితంగా తింటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డార్క్ చాక్లెట్ వినియోగం తక్కువ రక్తపోటు, మెరుగైన రక్త ప్రసరణతో సహా గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంది. డార్క్ చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్స్ కు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతోపాటు వాపును తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.