Image Source: pexels

ఎంతో ప్రశాంతంగా కనిపించే సముద్రాలు.. ఎప్పుడు ప్రమాదకరంగా మారిపోతాయో చెప్పలేం.

పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అంతరిక్ష రహస్యాలను కనుగొన్నారే గానీ.. సముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోలేకపోయారు.

ప్రస్తుతం మన భూమిపై ఎన్నో ప్రమాదకర సముద్రాలున్నాయి. అవేంటో చూడండి.

డ్రేక్ పాసేజ్ - ఇది అంటార్కిటికాలోని సౌత్ షెట్లాండ్ దీవుల మధ్య ఉన్నది. ఈ సముద్రంలో ఓడలు నడపడం అంత ఈజీ కాదు.

బేరింగ్ సముద్రం - ఈ సముద్రం అలస్కా గల్ఫ్ , రష్యా మధ్య ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి.

ఉత్తర సముద్రం - ఇది ఉత్తర ఐరోపాలోని ఒక సముద్రం. ఇక్కడ ఉష్ణోగ్రతలు అందరికి అనుకూలించవు.

గల్ఫ్ ఆఫ్ ఏడెన్ - యెమెన్, సోమాలియా మధ్య ఉన్న ఈ సముద్రంలో వెళ్లే ఓడలు, పడవలు దుండగుల దాడులకు గురవ్వుతాయట.

నల్ల సముద్రం - ఈ సముద్రం లోతు తక్కువగా ఉండటం వలన ఎక్కువ ప్రమాదాలు ఎక్కువ.

మధ్యధరా సముద్రం - స్పెయిన్ నుంచి ఈజిప్ట్ వరకు ఇది విస్తరించి ఉంది. తీవ్రమైన అలలు వల్ల బోటులు ప్రమాదాలకు గురవ్వుతాయి.

Image Source: pexels

టాస్మాన్ సముద్రం - ఈ సముద్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఉన్నది. ఇక్కడ తుఫానులు అల్లకల్లోలం చేస్తాయి.