పిల్లలకు తల్లిపాలు ఎప్పుడు మానిపిస్తే మంచిదంటే? చిన్న పిల్లలకు తల్లిపాలు ఎప్పుడు మానిపించాలనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. కొందరు 6 నెలలకు మానిపిస్తే, మరికొందరు రెండేళ్ల వరకు పాలు ఇస్తారు. పిల్లలకు 6 నెలలు నిండాకే పాలు ఇవ్వడం తగ్గించాలంటున్నారు వైద్యులు. చిన్న పిల్లలకు 6 నెలల నుంచి ఉగ్గు తినిపించడం మంచిదంటున్నారు. ఓవైపు పాలు ఇస్తూనే మరోవైపు మెత్తగా ఉడికించిన ఆహారం పెట్టాలంటున్నారు. తల్లిపాలతో పాటు పోషకాహారాన్ని ఇవ్వడం వల్ల చిన్న పిల్లల్లో ఎదుగుదల బాగుటుంది. 6 నెలల తర్వాత కూడా కేవలం తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో పోషకలోపం ఏర్పడుతుంది. పిల్లలు బయటి ఆహారాన్ని తినడం ప్రారంభించాక తల్లిపాలు తాగడం మానేస్తారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com