Image Source: Pexels and Pixabay

ఆత్మ రక్షణ కోసమే ‘ఉల్లిపాయలు’ అలా చేస్తాయట, మీరు అస్సలు నమ్మలేరు!

ఉల్లిపాయ లేనిదే కూరలకు టేస్టే రాదు. కానీ, దాన్ని కొయ్యడమే పెద్ద టాస్క్. కారణం.. దాని పవర్.

ఉల్లిపాయ కోస్తున్నప్పుడు కళ్లు ఎలా మండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది చాలా చిట్కాలు పాటిస్తుంటారు.

అయితే, ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కళ్లు మండటానికి కారణం.. దాని డిఫెన్స్ మెకానిజమ్.

ఔనండి.. ఉల్లిపాయలు తమ ఆత్మ రక్షణ కోసమే అలా చేస్తాయట. అందుకే, వాటికి పురుగుపట్టదు.

మనం ఉల్లిని కోసేప్పుడు కణాలు దెబ్బతింటాయి. అమీనో యాసిడ్స్ అప్రమత్తమై సల్ఫర్ కాంపౌండ్స్ తయారుచేస్తాయి.

ఆ రసాయనాన్ని ఆవిరి రూపంలో గాల్లోకి వదులుతుంది. అది మన కళ్లకు మంట పుట్టిస్తాయి.

ఉల్లి వదిలిన సల్ఫ్యూరిక్ యాసిడ్ కళ్లను ఇరిటేట్ చేస్తాయి. అందుకే మంట, కన్నీళ్లు ఒకేసారి పుడతాయి.

ఉల్లిలోనే కాదు, ఒక్కో కూరగాయలో ఒక్కో రకం రక్షణ వ్యవస్థ ఉంటుంది. మనకు తెలియకుండానే రియాక్షన్ కలిగిస్తాయి.

తమని ఎవరూ తినేయకూడదనే అవి అలా చేస్తాయట. చూశారా.. వెగాన్స్, మొక్కల్లో కూడా జీవం ఉంటుంది.