పుట్టగొడుగులు తింటే బరువు తగ్గడమే కాదు మెదడుకు ఎంతో మంచిది. పుట్టగొడుగుల్లో సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పుట్టగొడుగులు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీటా గ్లూకాన్ వంటి సమ్మేళనాలు గట్ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. జీర్ణఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పుట్టగొడుగులు మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి. వీటిలో తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడంలో మేలు చేస్తాయి. పుట్టగొడుగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పుట్టగొడుగులు రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. పుట్టగొడుగులు రెగ్యులర్ గా తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.