అన్వేషించండి

Bottled Water : రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు

Drinking Bottled Water Every Day :రోజూ బాటిల్ వాటర్ చాలామంది తాగుతారు. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటితో మైక్రోప్లాస్టిక్స్, ఇతర రసాయనాలు శరీరంలోకి చేరే అవకాశం ఉందా? వీటివల్ల ఆరోగ్యానికి వచ్చే నష్టాలివే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్లాస్టిక్ తగ్గించి స్టీల్, గాజు బాటిళ్లు వాడటం శ్రేయస్కరం.

Daily Bottled Water Consumption Risk : దాహం వేసినప్పుడు వెంటనే నీళ్లు తాగేందుకు చాలామంది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లలోని నీటిని తాగుతారు. జర్నీ, సినిమాలు చూసేప్పుడు ఇలాంటి సమయాల్లోనే కాకుండా.. ఆఫీసుల్లో, ఇళ్లలో కూడా బాటిల్ వాటర్ వినియోగం ఎక్కువగానే ఉంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని రోజూ తాగడం వల్ల మైక్రోప్లాస్టిక్స్, ఇతర రసాయనాలు శరీరంలోకి చేరే అవకాశం ఉందా? వీటితో ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉంటుంది? బాటిల్ వాటర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వైద్యులు ఇస్తోన్న సూచనలు ఏంటో తెలుసుకుందాం.

మైక్రోప్లాస్టిక్స్ 

ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీటిలో మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ అనే అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉండే అవకాశం ఉంది. బాటిళ్ల తయారీ, నిల్వ, రవాణా వంటి దశల్లో ఇవి నీటిలోకి చేరవచ్చు. ఇలా కలుషితమైన నీటిని తాగినప్పుడు ఈ కణాలు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read : వాటర్ బాటిల్ ఇలానే శుభ్రం చేయాలట.. ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్స్కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ దిలీప్ గూడె ప్రకారం.. బాటిల్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు పలు పరిశోధనల్లో గుర్తించారు. అయితే వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల మనుషుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయంపై ఇంకా పూర్తిస్థాయి ఆధారాలు అందుబాటులో లేవు. నిర్దిష్ట వ్యాధులకు మైక్రోప్లాస్టిక్స్ కారణమవుతాయని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.

హార్మోన్లపై ప్రభావం ఉంటుందా?

ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు ఆరోగ్య నిపుణుల్లో తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. ముఖ్యంగా థాలేట్స్ వంటి ప్లాస్టిక్ సంకలితాలు (Plastic Additives) హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి నీటిలోకి ఎంతమేరకు ఈ రసాయనాలు చేరుతాయనేది బాటిల్ తయారీకి ఉపయోగించిన పదార్థం, నిల్వ చేసిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 

Also Read : బరువు తగ్గడానికి వాటర్ ఫాస్టింగ్.. సోషల్ మీడియా ట్రెండ్ నిజంగా ఆరోగ్యమా? లేక ప్రమాదమా?

డాక్టర్ దిలీప్ ప్రకారం.. బాటిల్ వాటర్‌లో ఈ రసాయనాలు ఉన్నాయంటే తప్పనిసరిగా హార్మోన్ల సమస్యలు లేదా క్యాన్సర్ వస్తాయని భావించకూడదు. వాటి మోతాదు, శరీరానికి ఎంతకాలం పాటు చేరుతున్నాయనే అంశాలు కూడా ముఖ్యమే.

క్యాన్సర్ కారక సమ్మేళనాలు

కొన్ని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్‌లో థాలేట్స్‌తో పాటు పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. వీటిలో బెంజో(a)పైరీన్ వంటి కొన్ని సమ్మేళనాలను క్యాన్సర్ కారకాలుగా గుర్తించారు. అయితే PAHs సమూహంలోని ప్రతి రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని చెప్పలేం. 

ఏ రసాయనం ఎంత మోతాదులో శరీరంలోకి చేరుతోంది? ఎంతకాలంగా గురవుతున్నారు? అనే అంశాల ఆధారంగా ఆరోగ్య ప్రమాదం మారుతుంది. అందువల్ల కొన్ని శాంపిల్స్‌లో ఈ పదార్థాలు ఉన్నాయనే కారణంతో అన్ని బాటిల్ వాటర్లను ప్రమాదకరమైనవిగా భావించకూడదు.

Also Read : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్

నిల్వ చేసే విధానము ముఖ్యమే

బాటిల్ వాటర్‌ను సరిగ్గా శుద్ధి చేయకపోయినా, సీల్ సరిగ్గా లేకపోయినా లేదా నిల్వ చేసే సమయంలో పరిశుభ్రత పాటించకపోయినా కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాటిల్ మూత తెరిచిన తర్వాత దానిని పదేపదే ఉపయోగించడం, చేతులతో మూత లేదా బాటిల్ నోటి భాగాన్ని తాకడం వల్ల సూక్ష్మజీవులు చేరవచ్చు.

అందుకే బాటిల్ వాటర్ కొనేటప్పుడు సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎక్స్‌పైరీ లేదా బెస్ట్ బిఫోర్ తేదీని తనిఖీ చేయాలి. అలాగే బాటిల్‌పై సూచించిన నిల్వ నియమాలను పాటించాలి.

బాటిల్ వాటర్ తాగేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

బాటిల్ వాటర్ అంటే ప్రమాదకరమని కాదు. అయితే దాని నాణ్యత, తయారీ సంస్థ విశ్వసనీయత, నిల్వ విధానం వంటి అంశాలను తప్పనిసరిగా గమనించాలని డాక్టర్ దిలీప్ తెలిపారు. అందుకే రోజూ బాటిల్ వాటర్ తాగేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించారు. మీరు వాటర్ తాగాలనుకుంటే.. విశ్వసనీయమైన, నిబంధనలు పాటించే సంస్థల నుంచి తయారైన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే కొనాలి. బాటిల్ సీల్ దెబ్బతిన్నా, మూత సరిగా లేకపోయినా కొనకూడదు.

Also Read : వాటర్​ బాటిల్​లో మనీ ప్లాంట్​ను పెంచాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఎక్స్‌పైరీ లేదా బెస్ట్ బిఫోర్ తేదీని చెక్ చేసుకోవాలి. బాటిళ్లను నేరుగా ఎండలో లేదా అధిక వేడి ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయకూడదు. ఒకసారి తెరిచిన బాటిల్‌ను ఎక్కువసేపు నిర్లక్ష్యంగా ఉంచకూడదు. స్థానిక నీటి సరఫరా సురక్షితంగా ఉన్నప్పుడు.. ఇంటి వాటర్ ఫిల్ట్రేషన్ వ్యవస్థను ఉపయోగించవచ్చు. నీటిని నిల్వ చేసుకోవడానికి స్టీల్ లేదా గాజు బాటిళ్లను ఎంచుకుంటే మంచిది.

రోజూ బాటిల్ వాటర్ తాగడం మానేయాలా?

బాటిల్ వాటర్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థల నుంచి వచ్చిన, సరిగ్గా నిల్వ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సాధారణంగా సురక్షితమైన ఎంపికే. అయితే ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించి.. సాధ్యమైన చోట సురక్షితమైన ఫిల్టర్ నీటిని స్టీల్ లేదా గాజు బాటిళ్లలో నిల్వ చేసుకుంటే మంచిది. 

Also Read : జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Constipation in Winter : శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Mushrooms in Winter : చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?
చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?
Castor Oil on Navel : బొడ్డుపై ఆముదం ఇలా అప్లై చేయండి.. రోజూ రాస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
బొడ్డుపై ఆముదం ఇలా అప్లై చేయండి.. రోజూ రాస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget