Money Plant : వాటర్ బాటిల్లో మనీ ప్లాంట్‌ను పెంచాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Growing Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే వాటర్ బాటిల్లో మనీ ప్లాంట్‌ను ఎలా పెంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Indore Plant : అందంగా ఉంటుందనో.. ఆదాయం పెరుగుతుందనే నమ్మకంతోనో చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ పెంచుకుంటారు. మరికొందరికి మొక్కలు అంటే ఉన్న ఇష్టంతో వీటిని పెంచుకుంటారు. అలా కాకపోయినా.. వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపించకపోయినా.. బాగా పెరుగుతాయి కాబట్టి మంచి లుక్ కోసం మనీ ప్లాంట్స్‌ను పెంచుకుంటారు. పైగా ఇవి ఇండోర్, అవుట్‌డోర్‌లో కూడా బాగా, సింపుల్‌గా పెరుగుతాయి. అయితే కొందరు ఎంత శ్రద్ధ తీసుకున్న ఇంట్లో మనీ ప్లాంట్స్ పెరగవు. అయితే వారు ఈ టిప్స్ ఫాలో అయితే ఇంట్లో మనీ ప్లాంట్‌ను సింపుల్‌గా పెంచవచ్చు.
గాలిని శుద్ధి చెేస్తుంది..
ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి మనీ ప్లాంట్స్ మంచి ఎంపిక. ఇంట్లో చిన్న స్థలం ఉంటే చాలు. అక్కడ మీరు దీనిని ఈజీగా పెంచుకోవచ్చు. అలా ఆరుబయట వేసిన ఈజీగా పెరుగుపోతుంది. పైగా ఇది గాలిని శుద్ధీకరిస్తుంది. తద్వార పరిసరాలలో సానుకూలతను నింపుతాయి. మీరు ఎంత ట్రై చేసినా మనీ ప్లాంట్ పెరగట్లేదా? అయితే ఇంట్లోనే గాజు సీసాలో దీనిని ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిల్టర్ వాటర్ అయితే మంచిది
గ్లాస్ వాటర్ బాటిలో తీసుకోండి. దానిలో శుభ్రమైన లేదా ఫిల్టర్ చేసిన నీరు తీసుకోండి. సూర్యకాంతి ఇంట్లోకి వచ్చే ప్రదేశంలో దానిని ప్లేస్‌ను వెతుక్కోండి. ఇప్పుడు మనీ ప్లాంట్ మంచి కొమ్మను తీసుకోండి. ఈ కొమ్మకు ఆకులు, చిగురు, వేరు కచ్చితంగా ఉండేలా చూసుకోండి. లేత కొమ్మను కాకుండా.. కాస్త ముదిరిన కొమ్మను కట్ చేయండి. ఇప్పుడు గ్లాస్ కంటైనర్ తీసుకోండి. మీరు ప్లాస్టిక్ బాటిల్లో కూడా దీనిని ప్లేస్ చేయవచ్చు. వాటిని మీరు అంతకుముందు దేనికైనా ఉపయోగిస్తే.. వాటి అవశేషాలు పూర్తిగా పోయేవరకు క్లీన్ చేయండి.
నీటిలో ఇలా ప్లేస్ చేయండి..
శుభ్రమైన లేదా ఫిల్టర్ చేసిన నీటిని బాటిల్లో వేసి నింపండి. మనీ ప్లాంట్ కటింగ్ మొత్తం మునిగేవరకు నీరు ఉందో లేదో కన్ఫార్మ్ చేసుకోండి. కటింగ్‌ను నీటిలోకి చొప్పించండి. అప్పుడు మొక్క పైకి తేలకుండా ఉంటుంది. కటింగ్ నీటిలోకి వెళ్లిన తర్వాత ఆకు నీటి ఉపరితలంపై ఉండేలా చూసుకోండి. ఈ బాటిల్‌ను సూర్యకాంతి పరోక్షంగా పడే ప్రాంతంలో ఉంచండి. అధిక వేడిని దూరం చేయడానికి సూర్యరశ్మి నేరుగా పడే ప్రాంతంలో ఉంచకండి. వేడి డైరక్ట్‌గా పడితే గ్లాస్ కూడా బ్రేక్ అయ్యే అవకాశముంది.
నీటిని ఎప్పుడు మార్చాలంటే..
ఫంగస్ పెరుగుదలను నివారించడానికి, శుభ్రతను కాపాడుకోవడానికి.. మొక్క పెరుగుదల బాగుండాలంటే గ్లాస్‌లోని నీటిని మార్చాలి. అయితే ఎన్ని రోజులకు ఈ వాటర్‌ని ఛేంజ్ చేయాలో తెలుసా? మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే రోజూ నీరు మార్చాల్సిన అవసరం లేదని.. వారానికోసారి సీసాలోని నీటిని మార్చవచ్చు. మనీ ప్లాంట్ మూలాలను గమనిస్తూ ఉండండి. దాని పెరుగుదలను బట్టి మొక్కను అడ్జెస్ట్ చేయండి. మొక్క పెరుగుదల, మీ కావాల్సిన లుక్‌ని బట్టి.. కావాల్సిన ఆకృతిలో కట్ చేసుకోవచ్చు. ఇలాచేయడం వల్ల మొక్క బాగా పెరుగుతుంది.
Also Read : బరువు తగ్గాలనుకుంటే స్మూతీలు తాగకూడదట.. ఎందుకంటే..