Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటే స్మూతీలు తాగకూడదట.. ఎందుకంటే..
tips for Lose weight : జిమ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత హెల్తీగా ఉండేందుకు చాలామంది స్మూతీలు తాగుతారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే దానిని మానేయంటున్నారు నిపుణులు ఎందుకంటే..
Smoothies for Weight Loss : మీకు జిమ్‌కి వెళ్లే అలవాటు ఉంటే మీరు స్మూతీలకు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు బరువు తగ్గడం కోసం జిమ్‌కి వెళ్తుంటే మీరు కచ్చితంగా స్మూతీలను దూరంగా పెట్టాలని అంటున్నారు. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలకు దృష్టిని మరల్చమని సూచిస్తున్నారు. లేదంటే మీరు జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేసినా లాభం లేదని.. బరువు యథావిథిగా పెరుగుతారని చెప్తున్నారు. అసలు స్మూతీలు ఎందుకు తాగకూడదో.. వాటికి ప్రత్యామ్నాయంగా ఏమి తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా స్మూతీ
స్మూతీలను చాలామంది ఇష్టపడతారు. పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తీసుకుంటారు. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా స్మూతీలను తీసుకుంటారు. వీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని.. పైగా బ్రేక్‌ఫాస్ట్ చేయనవసరం లేదని.. ఈజీగా తయారు చేసుకోవచ్చు అనుకుంటారు. అనుకున్నదానికి తగ్గట్టే వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పైగా స్మూతీలు మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి. అయితే ఇవి బరువు తగ్గిస్తాయని మాత్రం అనుకోవద్దు అంటున్నారు నిపుణులు.
బరువును పెంచేస్తాయి..
అవును నిజమే.. స్మూతీలు బరువు తగ్గడంలో ఏ మాత్రం హెల్ప్ చేయవట. పైగా వీటిని తాగడం వల్ల బరువు పెరుగుతారు అంటున్నారు నిపుణులు. ఇవి మంచి కంటే హానిని ఎక్కువ చేస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. దీనిని తాగడం వల్ల బరువు తగ్గడానికి అవసరమైన కేలరీలను బర్న్ చేయడాన్ని ఇది కష్టతరం చేస్తుంది. మీరు జిమ్‌లో కేలరీలు బర్న్ చేసి.. దానికంటే తక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు మాత్రం శరీరంలో కేలరీలు తగ్గుతాయి.
వాళ్లకి స్మూతీలు మంచివే..
ఆఫీస్, ఇంట్లో పనులు చేసుకునేవారికి స్మూతీలు అస్సలు మంచి ఎంపిక కాదు అంటున్నారు. అథ్లెట్లు, కండరాలు బిల్డ్ చేసుకోవాలనుకునేవారికి స్మూతీలు మంచివని చెప్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఇది అస్సలు పనిచేయదంటున్నారు. ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. పండ్లలోని, కూరగాయల్లోని ఫైబర్ మీకు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది అనుకుంటారు. కానీ.. స్మూతీలలో కూరగాయలు, పండ్లు మిక్స్ చేసినప్పుడు అవి వాటిలోని ఫైబర్‌ను కోల్పోతాయట. దీనివల్ల బరువు ఏమాత్రం తగ్గరు. అయితే మీరు పండ్లు, కూరగాయలను నేరుగా తింటే మంచిది. ఇలా చేయడం వల్ల ఫైబర్ మీ శరీరానికి అందుతుంది. బరువు తగ్గే అవకాశముంది.
స్మూతీకి ప్రత్యామ్నాయాలు
జిమ్ చేసి వచ్చిన తర్వాత స్మూతీకి బదులుగా మీరు గ్రీన్ టీ, హెర్బల్ టీ, ప్రోటీన్ వాటర్, వెజిటబుల్ జ్యూస్ వంటి వాటిని ట్రై చేయవచ్చు. లేదంటే కొన్ని హెల్తీ డ్రింక్స్‌కు మీ రోటీన్ ఛేంజ్ చేయవచ్చు. గ్రీన్ టీ వంటి పానీయాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని జ్యూస్‌లు కండరాల నొప్పులను దూరం చేస్తాయి. వైద్యుడిని కలిసి మీకు ఏవి సెట్ అవుతావో తెలుసుకుని అదే డైట్‌ని ఫాలో అవ్వండి.
Also Read : బ్యాటర్ ఒకటే రెసిపీలు రెండు.. ఇన్స్టాంట్ ఇడ్లీలు, దోశలు ఇలా చేసేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.